ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్లోని మురద్నగర్లో దారుణం జరిగింది. స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం ఓ యువకుడిని బలి తీసుకుంది. మద్యం మత్తులో ఉన్న తోటి స్నేహితులు ఆ యువకుడిని కర్రలతో కిరాతకంగా కొట్టి చంపారు.
![Young man beaten to death in ghaziabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gzb-01-sonu-vis-dlc10020_17052021205347_1705f_1621265027_190.jpg)
ఏం జరిగింది?
మురద్నగర్కు చెందిన సోను ఓ డైవర్. గంగానదిలో మునిగిపోతున్న చాలా మందిని కాపాడాడు. తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో మిగతా స్నేహితులు సోనును కర్రలతో కిరాతకంగా కొట్టి చంపారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
![Young man beaten to death in ghaziabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gzb-01-sonu-vis-dlc10020_17052021205347_1705f_1621265027_174.jpg)
ఇదీ చదవండి : తౌక్టేకు 'మహా'లో 11మంది బలి -వేల ఇళ్లు ధ్వంసం