ETV Bharat / bharat

పెళ్లి కావడం లేదని యువరైతు ఆత్మహత్య.. 8ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు..

Young Farmer Suicide In Karnataka : కర్ణాటకలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే మనస్తాపంతో ఈ చర్యకు పాల్పడ్డాడు.

young farmer suicide in karnataka
పెళ్లి కావడం లేదని యువరైతు ఆత్మహత్
author img

By

Published : Jun 24, 2023, 4:15 PM IST

Updated : Jun 24, 2023, 5:02 PM IST

Young Farmer Suicide In Karnataka : పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని ఎవరూ ఇవ్వడం లేదని.. ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనుల కోసం పొలానికి వెళ్లి.. అక్కడే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బాదగి తాలూకాలోని మాసనగి గ్రామానికి చెందిన మంజునాథ్(36)​ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అయితే, గత ఎనిమిదేళ్లుగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు మంజునాథ్​. కానీ అతడికి అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో మంజునాథ్​ సహా అతడి తల్లిదండ్రులు కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

దీనిపై తీవ్రంగా ఆలోచించిన మంజునాథ్​ జూన్​ 15న మధ్నాహ్నం 2 గంటలకు విషం తాగాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు వెంటనే ​అతడ్ని హవేరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అక్కడ మంజునాథ్​ పరిస్థితి మరింత విషమించడం వల్ల.. హుబ్బళ్లిలోని కిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ జూన్​ 21న మంజునాథ్​ కన్నుమూశాడు.

"మంజునాథ్​ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 8 ఏళ్లుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు." అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వారు వెల్లడించారు. తల్లిదండ్రులను బాగా చూసుకోలేకపోతున్నాని మంజునాథ్​ నిత్యం బాధపడేవాడని గ్రామస్థులు తెలిపారు. కాగా కుమారుడి మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.
గత కొంతకాలంగా కర్ణాటకలో.. రైతులకు అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ అంశం తీవ్ర చర్చనీయంగా మారింది.

పెళ్లి కావడం లేదని.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య..
కొంత కాలం క్రితం మహరాష్ట్ర రాజధాని ముంబయిలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ తనకు పెళ్లికాకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీలో ఉద్యోగం, మంచి జీతం ఉన్నా.. చానాళ్లుగా పెళ్లికావడం లేదని ఈ ఘటనకు పాల్పడ్డాడు.

తెలంగాణకు చెందిన రాజ్​కుమార్​.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డి గ్రామ వాసి. ముంబయిలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పనిచేసేవాడు. కొవిడ్​ సమయంలో ఇంటికొచ్చి ఇక్కడి నుంచే పనిచేస్తున్నాడు. జీవితంలో స్థిరపడిన రాజ్​కుమార్​కు.. కుటుంబ సభ్యులు కొన్నాళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినప్పటికీ ఏదీ కుదరడం లేదు. ఎప్పటికీ పెళ్లికాదని మనస్తాపం చెందిన రాజ్​కుమార్​.. ఇంట్లో దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందొచ్చిన కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Last Updated : Jun 24, 2023, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.