Couple charred to death: కారులో మంటలు చెలరేగి నవ దంపతులు సజీవ దహనమైన విషాద ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. మృతులు బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన దంపతులు యశ్వంత్(23), జ్యోతి(23)లుగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు ఆర్టీ నగర్‌కు చెందిన దంపతులు మే 18న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు జ్యోతి తన కుటుంబ సభ్యులతో తెలిపింది. మరోవైపు.. తరగతులకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు యశ్వంత్ చెప్పారు. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో హెబ్బల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు.
ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉడుపిలో మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తాము వెళ్లేసరికే ఇద్దరు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. తమ జీవితాలను ముగిస్తున్నామని వారి తల్లిదండ్రులకు సందేశం పంపించారని తెలిపారు. అయితే, వారి మరణానికి గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ఇంట్లోకి వెళ్లి ఏనుగు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
కుక్కల నుంచి తప్పించుకోబోయి బోరుబావిలో బాలుడు- మృత్యువుతో పోరాటం