ETV Bharat / bharat

'భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. పిల్లలకు కాదు' - సుప్రీంకోర్టు

ఆభరణాల వ్యాపారి కేసులో విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు గానీ పిల్లలకు కాదని స్పష్టం చేసింది. పిల్లల సంరక్షణను చూసుకోవాల్సిందేనని ఆదేశించింది.

sc
సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 18, 2021, 7:00 AM IST

ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు గానీ పిల్లలకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి సంరక్షణ నిమిత్తం రూ.4 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 2019 నుంచి విడివడి ఉంటున్న భార్యాభర్తల పరస్పర అంగీకారం మేరకు విడాకులు మంజూరు చేసింది. ముంబయికి చెందిన ఆభరణాల వ్యాపారి దాఖలు చేసిన విడాకుల కేసుపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పరస్పర ఒప్పందంలోని షరతులకు ఉభయులు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.

పిల్లల సంరక్షణ చూడాల్సిందే..

కరోనా వల్ల మారిపోయిన పరిస్థితుల్లో తన క్లయింట్‌ రూ.4కోట్ల పరిహారం చెల్లించడానికి మరికొంత సమయం కావాలని భర్త తరపు న్యాయవాది కోరారు. దానికి ధర్మాసనం అంగీకరించలేదు. కడుపున పుట్టిన పిల్లల సంరక్షణను చూసుకోవాల్సిందేనని, మైనర్‌ పిల్లల పోషణ నిమిత్తం తాము చెప్పిన మొత్తాన్ని చెల్లించాలని తేల్చిచెప్పింది.

వచ్చే నెల ఒకటో తేదీన రూ.కోటి, ఆ నెల 30న మిగిలిన రూ.3 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. కక్షిదారులు పరస్పరం దాఖలు చేసుకున్న కేసుల్ని కొట్టివేసింది.

ఇదీ చదవండి: 'పెగసస్​పై కేంద్రం 10 రోజుల్లో సమాధానం చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.