Yogi meets Pm Modi: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయంతో అధికారి నిలబెట్టుకున్న భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు దిల్లీ వెళ్లిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కూర్పు, ప్రమాణ స్వీకార కార్యక్రమం సహా పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. సుమారు గంటన్నరకు పైగా ఈ భేటి జరిగింది. దీనిపై ట్వీట్ చేసిన మోదీ.. భవిష్యత్తులో యూపీని సరికొత్త అభివృద్ధి శిఖరాల వైపు యోగి ఆదిత్యనాథ్ నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పలువురు పార్టీ పెద్దలను కూడా కలుస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, రాజ్నాథ్లతో కూడా సమావేశం అయ్యారు.
అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భాజపా జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోశ్‌తో కూడా యోగి భేటీ అయ్యారు. యోగి రెండు రోజుల పాటు దిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: కాంగ్రెస్ చరిత్రలోనే చెత్త రికార్డు- 97% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు!