ETV Bharat / bharat

'2024లో దేశ ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్!'​ - యోగి ఆదిత్యనాథ్​

ప్రధానిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టి తన రాజకీయ చతురతను చాటుకున్నారు నరేంద్ర మోదీ(PM modi). మరోమారు ఆయనే ప్రధాని అవుతారని ఆ పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే.. 2024 ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(yogi adityanath news)​ ప్రధానమంత్రి(prime minister of india) అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ రక్షా సేన జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రబోధానంద గిరి (prabodhananda swami).

yogi-adityanath
యోగి ఆదిత్యనాథ్
author img

By

Published : Nov 17, 2021, 2:14 PM IST

Updated : Nov 17, 2021, 3:01 PM IST

2024లో దేశ ప్రధాన మంత్రిగా(prime minister of india) ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(yogi adityanath news)​ ఎన్నికవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ రక్షా సేన జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రబోధానంద గిరి(prabodhananda swami). ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీబీత్​లో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

యోగికి (yogi adityanath latest news) మాత్రమే భారత్​ను హిందూ దేశంగా ప్రకటించగల సత్తా ఉందని పేర్కొన్నారు ప్రబోధానంద(prabodhananda swami).

హిందూ రక్షణ సేనా జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రబోధానంద గిరి

" 2017 ఎన్నికల సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి కావాలని, వేరే వారు సీఎం అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పాను. హిందువుల తరఫున పోరాడేది కేవలం యోగి ఒక్కరే. ఇప్పుడు కేవలం భారత్​లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ, హిందుత్వానికి రక్షణగా ఎలాంటి భయం లేకుండా నిర్ణయం తీసుకునేది యోగి ఒక్కరే. 2024లో యోగి ప్రధాని అయితేనే హిందూవులకు మేలు జరుగుతుంది. భారత్​కు ప్రధానమంత్రి యోగి కావాలని కోరుకుంటున్నాం. "

- స్వామి ప్రబోధానంద గిరి, హిందూ రక్షా సేన జాతీయ అధ్యక్షుడు

కంగన వ్యాఖ్యలపై..

'భారత్‌కు అసలైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చింది. 1947లో వచ్చింది కేవలం భిక్షే' అంటూ బాలీవుడ్​ నటి కంగనా రనౌత్(kangana ranaut news)​ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలను కొంత మేర సమర్థించారు ప్రబోధానంద​. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం నిజమైంది కాదని, అయితే.. నేటికీ మనం స్వతంత్రం పొందలేదన్నారు. బ్రిటిషనర్ల నిబంధనలు ఇంకా దేశంలో ఉన్నాయని, భారత్​కు కొత్త రాజ్యాంగం అవసరమని తెలిపారు.

ఇదీ చూడండి: మహాత్మా గాంధీపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు- శివసేన ఫైర్​

Last Updated : Nov 17, 2021, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.