yoga in Mbbs course: ఈ విద్యాసంవత్సరం (2021-22) ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థులందరికీ పాఠ్యాంశంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశిస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు/సంస్థలు తక్షణం తమ పరిధిలోని ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా శిక్షణ మొదలుపెట్టాలని పేర్కొంది.
2021-22 విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో యోగాను అంతర్భాగం చేస్తూ మార్చి 31నే ఉత్తర్వులు వెలువరించిన విషయాన్ని ఎన్‌ఎంసీ గుర్తు చేసింది. ప్రతి సంవత్సరం జూన్ 12 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వరకు దేశవ్యాప్తంగా అన్ని వైద్యకళాశాలల్లో ప్రతిరోజూ గంట పాటు ఫౌండేషన్ కోర్స్ కింద విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.
ఇదీ చదవండి: గుడ్న్యూస్.. భానుడి భగభగల నుంచి కాస్త రిలీఫ్.. మంగళవారమే మొదలు!