ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయటాన్ని తప్పు పడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. దేశ ప్రజల అవసరాలు తీర్చకుండా ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపటం ఏంటని ప్రశ్నించారు. ఐరాసలో భారత ప్రతినిధి నాగరాజ్ నాయుడు మాట్లాడిన ఓ విడియోను ట్విట్టర్లో షేర్ చేశారు సిన్హా.
" దేశ ప్రజలకు అందించిన వ్యాక్సిన్ల కన్నా.. విదేశాలకే ఎక్కువ వ్యాక్సిన్లు సరఫరా చేసినట్లు ఐరాసలో భారత ప్రతినిధి తెలిపారు. ఇప్పుడు ప్రపంచ నేతగా ఎదిగిన మోదీ.. దేశ ప్రజలను మాత్రం నరకంలోకి నెట్టాడు. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు సరైన విధానం ఏదైనా ఉందంటే.. అది కేంద్రం, రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలు చేస్తున్నట్లు కేసుల సంఖ్యను తగ్గించి చూపించడమే. ఈ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రథమ బహుమతి ఇవ్వాలి. "
- యశ్వంత్ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి.
టీకాల ఎగుమతిని విమర్శిస్తు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై బంగాల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కొరతకు కేంద్ర విధానాలే కారణంగా ఆరోపించారు.
ఇదీ చూడండి: నారదా స్కామ్: బంగాల్ మంత్రులను అరెస్ట్ చేసిన సీబీఐ