సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలాకు భద్రత పెంచుతూ.. కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పూనావాలాకు దేశమంతటా సీఆర్పీఎఫ్ ద్వారా వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కేంద్రం తెలిపింది.
అదనపు భద్రత కల్పించాలని ఎస్ఐఐ డైరెక్టర్ ప్రకాష్‌కుమార్ సింగ్ ఏప్రిల్ 16 న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు వివిధ సమూహాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ తర్వాత పూనావాలాకు భద్రత పెంచుతూ కేంద్రం ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: కొవిడ్ రోగికి తెగిన చేయిని అతికించిన వైద్యులు