ETV Bharat / bharat

Wrong e Challan Complaint in Online : మీకు తప్పుడు చలాన్ వచ్చిందా.. ఇప్పుడేం చేయాలి..?

Wrong e Challan Complaint in Online : మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినప్పుడు ఇ చలాన్ పడిందా? కానీ అందులో మీరు ఉల్లంఘించిన దానికంటే ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ఉందా? అయితే ఇది మీకోసమే. ఇలాంటి సందర్భాల్లో మీరు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా ఆన్​లైన్​లో రవాణాశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

How to Complaint against Wrong E Challan in Telugu
Wrong e Challan Complaint Telangana Online
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 10:26 AM IST

How to Complaint against Wrong E Challan in Online : వాహనదారులు ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) అతిక్రమించినప్పుడు ట్రాఫిక్ సిబ్బంది ఫైన్ విధిస్తారు. అయితే.. ఒక్కోసారి వాహనాదారులు తప్పుడు చలాన్ అందుకుంటారు. దీనివల్ల పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మరి, అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. ఇప్పుడు దీని గురించి చింతించాల్సిన పనిలేదు. ఆన్​లైన్​లోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది.

తప్పు ఇ-చలాన్ అంటే ఏమిటి?

What is Wrong E Challan : ఎవరైనా సాధారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే ఇ-చలాన్ విధిస్తారు. అయితే.. చేసిన నేరం ఒకటైతే.. మరో విధమైన చలాన్ అందుకుంటే.. అది తప్పుడు ఇ-చలాన్(Wrong E Challan) అవుతుంది. ఇలాంటి సందర్భంలో తప్పుడు ఇ-చలాన్​పై ఫిర్యాదు చేయొచ్చు. దీని కోసం వాహనదారులు తగిన ఆధారాలు సమర్పించాలి. ఆ వివరాలతో సదరు బాధిత వ్యక్తి ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడవచ్చు. మెయిల్ లేదా ఫోన్ చేయొచ్చు. వెబ్​సైట్​లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీ ఫిర్యాదును పరిశీలించి తిరిగి సమాధానం ఇవ్వడానికి.. 15 రోజుల వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది.

  • ఈ-మెయిల్ చిరునామా : helpdesk-echallan@gov.in
  • హెల్ప్‌లైన్ నంబర్: 0120-2459171 (ఉదయం 6:00 నుంచి రాత్రి 10:00 గంటల మధ్య)

How to Check Status of TS e-Challans Online : మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా.. ఇప్పుడే మీ ఇ-చలాన్ స్టేటస్ చెక్ చేసుకోండిలా.!

How to File Complaint Against Wrong e-Challan in Online :

ఆన్‌లైన్​లో ఫిర్యాదును ఎలా చేయాలంటే..

  • మొదట మీరు ఇ-చలాన్ అధికారిక echallan.parivahan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అక్కడ 'Complaint'అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే మీకు గ్రీవెన్స్ సిస్టమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు మీ ఖాతాలోకి లాగిన్ అయ్యి.. మీ పేరు, సంప్రదింపు నంబర్, చలాన్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.
  • ఆ తర్వాత తప్పుడు ఇ-చలాన్ ఫిర్యాదు ప్రూఫ్​ను అప్‌లోడ్ చేయాలి.
  • ఇక చివరగా అప్‌లోడ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 'Submit'పై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత, సమర్పించిన ఇ-చలాన్ ఫిర్యాదును ట్రాఫిక్ పోలీసు విభాగం పరిశీలిస్తుంది.
  • ఫిర్యాదుల సిస్టమ్‌లో దాన్ని తనిఖీ చేసిన తర్వాత.. డిపార్ట్‌మెంట్ మీకు త్వరలో అప్‌డేట్‌ను అందిస్తుంది.

తప్పు ఇ-చలాన్‌పై మీ ఫిర్యాదును ఎలా ట్రాక్ చేసుకోవచ్చంటే..

How to Track Status Complaint Against Wrong e-Challan in Online :

మీ ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా ఆన్​లైన్​ ద్వారా తెలుసుకోవచ్చు. దానికోసం.. ఈ స్టెప్స్ ఫాలోకావాలి.

  • మీ బ్రౌజర్‌లో https://echallan.parivahan.gov.in/gsticket/ వెబ్‌పేజీని ఓపెన్ చేయాలి.
  • అనంతరం క్రిందికి స్క్రోల్ చేసి 'Ticket Status' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు కంప్లైంట్ సమయంలో మీకు ఇచ్చిన.. ఇ-టికెట్ లేదా ఇ-చలాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • తర్వాత క్యాప్చా కోడ్‌ను ఫిల్ చేయాలి.
  • చివరగా 'Check the Status'అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • దాంతో మీ స్టేటస్ స్క్రీన్​పై కనిపిస్తుంది.

'హెల్మెట్​ పెట్టుకోలేదు.. రూ.500 ఫైన్​ కట్టు'.. కారు ఓనర్​కు పోలీసుల నోటీస్

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా? ఇక 15 రోజుల్లోనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.