ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ భారత్​లో.. పెంటగాన్​ను మించి 'సూరత్​ డైమండ్స్'​ మార్కెట్ - ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం

Worlds Largest Office Building : ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం సూరత్‌లో ఏర్పాటైంది. ఇప్పటివరకు అతిపెద్ద కార్యాలయ సముదాయంగా ఉన్న అమెరికాలోని పెంటగాన్‌ కంటే ఎక్కువ విస్తీర్ణంలో గుజరాత్‌ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఈ సముదాయానికి సూరత్ డైమండ్ బోర్స్ అని నామకరణం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం ప్రత్యేకతలను చూద్దాం.

Worlds Largest Office Building
Worlds Largest Office Building
author img

By

Published : Jul 19, 2023, 6:25 PM IST

Updated : Jul 19, 2023, 9:07 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ భారత్​లో

Worlds Largest Office Building : ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ కట్టడం పేరు సూరత్‌ డైమండ్‌ బోర్స్‌. పేరుకు తగ్గట్టుగానే దీన్ని గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా నిలవనుంది. సూరత్‌ వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. ప్రపంచంలో 90శాతం వజ్రాలకు సానబెట్టడం, పాలిష్‌ చేయడం వంటివి సూరత్‌లోనే జరుగుతున్నాయి. వజ్రాల వ్యాపారం మరింత విస్తరించేందుకు ఈ కార్యాలయ సముదాయం దోహదం చేస్తుందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఇది దేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శమని, వాణిజ్యం, ఆవిష్కరణలకు కేంద్రంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృహత్‌ కట్టడం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని తెలిపారు.

Surat Diamond Bourse Cost : డైమండ్‌ కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా 65వేల మంది వజ్రాల నిపుణులు ఈ కాంప్లెక్స్‌ కేంద్రంగా పనిచేయనున్నారు. ఈ అతిపెద్ద కార్యాలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా డైమండ్‌ కట్టింగ్‌ క్యాపిటల్‌గా సూరత్‌ పేరును సుస్థిరం చేయనుంది.

ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయంగా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ ఉంది. 80ఏళ్లుగా పెంటగాన్‌ భవనం అతిపెద్ద కార్యాలయ సముదాయంగా గుర్తింపు పొందింది. పెంటగాన్‌ను 66లక్షల 73 వేల 624 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. SDBని 67లక్షల 28 వేల 604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

Surat Diamond Bourse Opening Date : SDBలో 15 అంతస్తుల టవర్లు తొమ్మిది ఉంటాయి. ప్రతి అంతస్తు ఒకదానితో మరొకటి స్పైన్‌ కారిడార్‌లతో అనుసంధానమై 4వేల 500 ఆఫీస్‌లను కలిగి ఉంటుంది. 35ఎకరాల స్థలంలో, 3వేల 200కోట్ల ఖర్చుతో పూర్తి హరిత భవనంగా నిర్మించారు. 67లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయం విస్తరించి ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయాన్ని నవంబర్‌ 21న ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 4వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యంత సాంకేతికతతో కూడిన స్మార్ట్‌ గేట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

Last Updated : Jul 19, 2023, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.