Worlds Largest and Heaviest Ramayana : అయోధ్య ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తమ భక్తిని వినూత్నంగా చాటుకుంది ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఓ సంస్థ. ప్రపంచంలోనే అతి బరువైన, పెద్ద రామాయణాన్ని రాముడికి కానుకగా ఇవ్వనుంది. ఇందుకోసం 3వేల కిలోల ఇనుమును ఉపయోగించి వాల్మీకి రామాయణాన్ని దానిపై చెక్కుతున్నారు. ఇప్పటికే 95కిలోల ఇనుముతో డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయగా, తాజాగా ఈ భారీ రామాయణాన్ని అనేక ప్రత్యేక ఫీచర్లతో రూపొందిస్తున్నారు.
శాస్త్రీపురంలోని శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్ అనే సంస్థ ఈ భారీ రామాయణాన్ని రూపొందిస్తోంది. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణంగా మారనుంది. దీనిని అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో సుమారు 30-35 పేజీలు ఉండనున్నాయని చెప్పారు. ప్రతి పేజీ సుమారు 100 కేజీల వరకు ఉంటుందని, మొత్తంగా 3వేల కిలోల బరువు ఉండనుందని సంస్థ సభ్యులు ఆరాధన చెప్పారు.
"కరోనా లాక్డౌన్ సమయంలో ఉన్నప్పుడు ఇంటిని శుభ్రం చేస్తుండగా రామాయణం కనిపించింది. కానీ అందులో కొన్ని పేజీలు చినిగిపోగా, మరికొన్ని చెదలు పట్టాయి. దీంతో చాలా బాధ పడ్డాను. ఈ క్రమంలోనే లోహంపై రామాయణాన్ని ఎందుకు చెక్కకూడదు అనే ఆలోచన వచ్చింది. అనేక మందితో చర్చలు చేసిన తర్వాత మొదటగా 95 కిలోల ఇనుముతో చిన్న రామయాణాన్ని తయారు చేశాం. దీని కోసం నెల రోజులపాటు కష్టపడ్డాం. ఏడు పేజీలు ఉన్న ఈ రామాయణంలో వాల్మీకి శ్లోకాలను చెక్కాం. త్వరలోనే దీనిని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేస్తాం."
--ఆరాధన సైనీ, శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్ సభ్యురాలు
ఈ భారీ రామాయణాన్ని 9 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల మందంతో రూపొందిస్తున్నారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ సమయానికి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని చెప్పారు. దీనిని తయారు చేయడానికి సుమారు రూ.కోటి వరకు ఖర్చు అయ్యిందని తెలిపారు. రామ భక్తులతో పాటు అనేక మంది ప్రజలు దీనికి సహాయం చేసినట్లు చెప్పారు.
రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం
అయోధ్య రాముడి కోసం షిర్డీలోని వృద్ధుల సంకల్పం - ప్రతి రోజూ 11 గంటల పాటు భజన