World Cup Hyderabad Security 2023 : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్(ICC World Cup 2023)లో భాగంగా మూడు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు.. సుమారు 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ట్రాఫిక్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన.. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
ఉప్పల్ స్టేడియం(Uppal Stadium in Hyderabad)లో రెండు వార్మప్ మ్యాచ్‌లను బీసీసీఐ(BCCI), హెచ్‌సీఐ సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈసారి ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయని.. అందుకు స్టేడియంలోకి వచ్చే ఎంట్రీ గేటు నుంచి వెళ్లే ఎగ్జిట్ గేటు వరకు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. అలాగే ప్రేక్షుకుల పార్కింగ్ వేదికలపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాలపై వారం రోజుల క్రితం బీసీసీఐ ప్రతినిధులు, హెచ్‌సీఐ అధికారులతో చర్చలు జరిపినట్లు వివరించారు.
ICC ODI World Cup 2023 in Hyderabad : అంతకు ముందు నిర్వహించిన ఐపీఎల్ మ్యాచ్‌లు సక్సెస్‌గా నిర్వహించిన అనుభవంతో అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయడం జరిగిందని సీపీ చౌహాన్ అన్నారు. ఆటగాళ్లు, ప్రేక్షుకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని.. నిర్వహణ ఏవైనా లోపాలు ఉంటే వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సిట్టింగ్ సామర్థ్యం ఉందని వివరించారు.
ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- ప్రతి మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రేక్షుకులు స్టేడియానికి వస్తారు. అధికారంగా గేట్లను 12 గంటలకే తెరుస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యంగా.. ఆ సమయంలో పటిష్ఠ భద్రత ఉంటుంది.
- పార్కింగ్ విషయంలో స్పష్టంగా ప్రతి ఒక్కరికీ సూచనలు, డైరెక్షన్‌లు ఇస్తాం.
- ఒక వ్యక్తి స్టేడియంలోకి ఎంట్రీ గేటు నుంచి వెళ్లిన తర్వాత నేరుగా తన స్టాండ్ ఏదైతే ఉందో అక్కడి వెళ్లాలి.
- ప్రేక్షకులు, పిచ్, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనవసర వస్తువులు స్టేడియం లోపలికి తీసుకొని వెళ్లకూడదు.
- కెమెరా, పండ్లు, అగ్గిపెట్టెలు, వాటర్ బాటిల్స్ వంటి అనవసర వస్తువులు స్టేడియంలోకి తీసుకువెళ్లకూడదు. అలాంటి వారిని లోపలికి అనుమతించరు.
- అందరినీ భద్రతా సిబ్బంది నిశితంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తారు.
- స్టేడియంలో ఆట ముగిసిన తర్వాత ఎవరు గెలిచినా.. ఓడినా సంమయనం పాటించాలి.. గొడవ పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయి.
- స్టేడియం చుట్టూ, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూం ద్వారా ప్రతి ఒక్కరి కదలికపై పటిష్ఠ నిఘా ఉంటుంది.
- మ్యాచ్ ముగిసిన అనంతరం బయటకు వెళ్లేటప్పుడు హడావుడి చేయడం, నెట్టుకోవడం వంటివి చేయకూడదు.
- ప్రేక్షకులు ఏ గేటు నుంచి వచ్చారో ఆ గేటు నుంచే మళ్లీ బయటకు వెళ్లాలి.
- గేట్లు, గోడలు దూకడం వంటివి చేయకూడదు.. పోలీసుల నిఘా ప్రతిక్షణం ఉంటుంది.
- అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, మహిళలను వేధించే వారి కోసం షీ టీంలు, క్రైమ్ టీంలు నిరంతరం సివిల్, యూనిఫాం డ్రెస్సెస్‌లో గస్తీ కాస్తూ ఉంటారు.
World Cup 2023 Opening Ceremony : క్రికెట్ లవర్స్‌కు నిరాశ.. వరల్డ్ కప్ వేడుకల్లో మార్పులు!