ETV Bharat / bharat

జుట్టు అలా ఉంటే కాలేజ్​లోకి నో ఎంట్రీ! - లూజ్​ హెయిర్​తో వస్తే నో ఎంట్రీ

బిహార్​ భాగల్​​పుర్​లోని ఓ మహిళా కళాశాల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. లూజ్​ హెయిర్​తో కాలేజ్​ ఆవరణలో కనిపించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది యాజమాన్యం.

Women's college in Bihar's Bhagalpur bans open hair
ఉంగరాల జుత్తుకు నో ఎంట్రీ
author img

By

Published : Aug 22, 2021, 6:36 PM IST

Updated : Aug 22, 2021, 6:58 PM IST

బిహార్​ భాగల్​పుర్​లోని సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని ఆదేశాలు జారీ చేసింది కాలేజ్​ యాజమాన్యం. అంతేగాకుండా ఈ ఏడాది ఇంటర్​లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్​కోడ్​ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అమ్మాయిలు లూజ్​ హెయిర్​తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. రామన్ సిన్హా తేల్చి చెప్పారు. కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది.

కమిటీ సిఫార్సుల మేరకే..

సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అనే మూడు విభాగాలు ఉన్న ఈ కళాశాలలో ప్రస్తుతం 1,500 మంది అమ్మాయిలు చేరారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ కొత్త డ్రెస్ కోడ్​ను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఉన్న సభ్యులు సూచించిన దుస్తులనే ధరించాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ అదేశాలను ఎవరైనా అతిక్రమించి డ్రెస్​కోడ్​ లేకుండా, జడ వేసుకోకుండా వచ్చే వారికి ప్రవేశం లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: Afghan news: తాలిబన్​ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి..

Last Updated : Aug 22, 2021, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.