Widow Woman Remarriage: కరోనా కారణంగా అన్నయ్య మరణించాడు. అతని భార్య, కూతురిని చూసుకునే వారే లేరు. పెళ్లి చేసుకొని తల్లీ కూతుర్ల బాధ్యతల్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు మృతుడి సోదరుడు సమాధాన్. ఆ వితంతువును పెళ్లి చేసుకుని సమాజంలో ఆదర్శంగా నిలిచాడు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది ఈ ఆదర్శ వివాహం.
![widow remarriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14377067_226_14377067_1644038849247.png)
![widow woman remarriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14377067_258_14377067_1644036805481.png)
ఇదీ జరిగింది:
అహ్మద్‌నగర్ జిల్లా అకోలే తాలూకాలోని ఢోక్రీకి చెందిన నీలేష్ శేటే 2021 ఆగస్టు 14న కరోనా రెండో వేవ్‌లో మరణించాడు. అతను రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం చేసేవాడు. కరోనా బారినపడి కోలుకుంటున్న సమయంలోనే.. మెదడులో కణితి ఏర్పడింది. నాసిక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిరోజులకే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి 19 నెలల కుమార్తె, భార్య పూనమ్ ఉన్నారు.
![Widow Woman Remarriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-ahm-shirdi-widowwomenmarried-3-vis-mh10010_03022022191953_0302f_1643896193_954.jpg)
ఇప్పుడు నీలేష్ సోదరుడే పూనమ్‌ను పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: అడవితల్లి రక్షణలో గుజరాత్ మహిళలు.. అన్నీ వారై..!