దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జులై 6న జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఆగస్టు 14లోగా నిందితుడిపై దిల్లీ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. నిందితుడి వివరాలు, అతడి గాలింపు కోసం పోలీసులు తీసుకున్న చర్యలను నివేదికలో పొందుపరచాలని కోరారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ముగ్గురు మైనర్ బాలికలు దిల్లీ నుంచి ముంబయి వెళ్లేందుకు జులై 6న న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అయితే వీరికి రైల్వే టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఓ యువకుడు రోహిణిలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆ ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అనంతరం ముగ్గురు బాలికలకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు నిందితుడు. దీంతో బాలికలు కూల్‌డ్రింక్ తాగి స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరుసటి రోజు ముంబయి వెళ్లాలని తమను పంపమని బాలికలు నిందితుడ్ని కోరారు. అప్పుడు రాజస్థాన్ తీసుకెళ్లి.. అక్కడ ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని బాలికలతో చెప్పాడు. వీరు బస్సు ఎక్కే సమయంలో నిందితుడి నుంచి తప్పించుకుని బాలికలు తమ ఇంటికి చేరుకున్నారు. వారిపై జరిగిన అత్యాచారం గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో కుటుంబ సభ్యులు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎవరికైనా చెబితే చంపేస్తా..
ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో దారుణం జరిగింది. 15 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 30 ఏళ్ల వ్యక్తి. ఈ ఘటన జామో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నిందితుడు.. బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో నిందితుడిపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
కారులో అత్యాచారం..
తమిళనాడు.. చెన్నైలోని పోరుర్‌లో కారులో ఉన్న ఓ మహిళను కత్తితో బెదిరించి ఆరుగురు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి నుంచి 15 సవర్ల బంగారాన్ని దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ఆరుగురిని గురువారం అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: దర్జాగా పడుకొని ఫ్లైట్‌లో సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్
పశువుల అక్రమ రవాణా.. టీఎంసీ బాహుబలి అరెస్టు.. 30 కార్ల కాన్వాయ్‌లో వచ్చి..