కేరళ మలప్పురానికి చెందిన అరుణిమ(23) అనే యువతి ఒంటరిగా సైకిల్‌పై 22 దేశాలు చుట్టొచ్చేందుకు బయలుదేరింది. 25వేల కిలోమీటర్ల సాహస యాత్రను రెండు సంవత్సరాలలో పూర్తిచేసే లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్వస్థలం నుంచి ఇటీవల ముంబయికి సైక్లింగ్ మొదలుపెట్టింది. ముంబయి నుంచి విమానంలో ఒమన్ చేరుకోనుంది. అక్కడి నుంచి వివిధ దేశాలకు సైకిల్‌పై వెళ్లనుంది. చివరి గమ్యంగా ఆఫ్రికన్ ఖండాన్ని చేరుకొనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అరుణిమ.
![Women can achieve everything](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2022-11-23-at-71232-pm_2311newsroom_1669211360_299.jpeg)
![Women can achieve everything](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2022-11-23-at-71232-pm-1_2311newsroom_1669211360_657.jpeg)
ఈ ఒంటరి ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమని అంటోంది అరుణిమ. "ప్రయాణంలో గుడారాలలో సేదతీరి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుందామనే ఆలోచనతో ఉన్నా" అని తెలిపింది. 'మహిళలు ఏదైనా సాధించగలరు' అని నిరూపించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించింది.
![Women can achieve everything](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2022-11-23-at-71320-pm_2311newsroom_1669211360_520.jpeg)
![Women can achieve everything](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2022-11-23-at-71254-pm_2311newsroom_1669211360_144.jpeg)
ఇలా ఒంటరిగా సాహస యాత్రలు చేయటం కేరళ మహిళలకు కొత్తేం కాదు. ఇటీవల ఓ యువతి కూడా ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్ చూసేందుకు జీప్‌లో కేరళ నుంచి ఖతర్‌కు ఒంటరిగా పయనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.