ఆకలితో ఆ కుటుంబం అలమటించింది. చట్టుపక్కల వారు ఆహారం అందించినా అది సరిపోయేది కాదు. పరిస్థితి విషమించింది. తీవ్ర అనారోగ్యపాలైన తన ఐదుగురు పిల్లలతో ఆ తల్లి ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించగా.. వారు రెండు నెలలుగా ఆకలితో అలమటించారని తేలింది. ఈ ఘటన ఉతర్ప్రదేశ్లో అలీగఢ్ జిల్లాలో జరిగింది.
"ఐదుగురిలో ముగ్గురి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం."
-డాక్టర్ అమిత్, మల్కాన్ సింగ్ ఆసుపత్రి, అలీగఢ్
అలీగఢ్‌లోని మందిర్ నగ్లా ప్రాంతంలో గుడ్డీ అనే 40ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమెకు అజయ్(20), విజయ్(15), తీతు(10), సుందర్ రామ్(5), అనురాధ(13) అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు.
తీవ్ర ఆనారోగ్యంతో 2020లో ఆమె భర్త వినోద్ చనిపోయాడు. అప్పటి నుంచి ఓ ఫ్యాక్టరీలో నెలకు రూ.4000 జీతానికి పనిచేసింది. కుటుంబానికి ఆసరాగా పెద్ద కుమారుడు అజయ్ కూలీ పనిచేసేవాడు. అయితే కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడం వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. పనిలేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. చుట్టుపక్కల వారు ఆహారాన్ని అందించినా సరిపోయేది కాదు. కేవలం నీళ్లుతాగే బతుకీడ్చారు. దాంతో వారంతా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.
ఇదీ చదవండి: పిల్లల ఆకలి తీర్చలేని స్థితిలో తల్లి!
ఇదీ చదవండి: తల్లితండ్రులు మృతి- చిన్నారికి అన్నీ తానైన అక్క