ఏమైందో తెలియదు. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లతో కలిసి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే.. ఆమె బతికింది. కానీ, తన నాలుగేళ్ల చిన్నారి మాత్రం నదిలో గల్లంతయింది. ఈ ఘటన కర్ణాటకలో(Karnataka Gadag News) జరిగింది.
అసలేమైంది?
గదగ్ జిల్లా(Karnataka Gadag News) రోనా తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన ఉమాదేవికి ముగ్గురు కుమార్తెలు. అందులో ఇద్దరి వయసు 14, 12 ఏళ్లు. మరో కుమార్తె వయసు నాలుగు ఏళ్లే. కరోనా కారణంగా మూడు నెలల క్రితం ఉమాదేవి భర్త సంగమేశ్ చల్లికేరి.. ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి ఆమె కుంగుబాటుకు లోనైందని అధికారులు తెలిపారు.
'ఉమాదేవి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి మలప్రభా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే... ఆ సమయంలో తన నాలుగేళ్ల చిన్నారి మినహా మిగతా ఇద్దరు కూతుళ్లు అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లారు. దాంతో ఉమాదేవి ఆ చిన్నారితో కలిసి నదిలో దూకింది. అయితే.. ఉమాదేవి ఒడ్డుకు చేరి, ప్రాణాలతో బయటపడింది' అని అధికారులు తెలిపారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే రోనా పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మహిళను ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది.. నదిలో గాలింపు చేపట్టారు.
ఇవీ చదవండి: