ETV Bharat / bharat

కుక్క పేరు తెచ్చిన తంట.. మహిళ ఒంటికి నిప్పంటించి.. - భావనగర క్రైమ్ న్యూస్

Woman set on fire by Neighbour: ముద్దుగా పెంచుకునే ఓ కుక్కకు పెట్టిన పేరు ఓ మహిళ ప్రాణానికే ప్రమాదకరంగా మారింది. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. అసలేమైందంటే..

fire
మంట, నిప్పు
author img

By

Published : Dec 22, 2021, 7:00 AM IST

Woman set on fire by Neighbour: ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి 'సోను' అని పేరు పెట్టడమే ఆ మహిళకు శాపంగా మారింది. ఆ పేరు పెడతావా అంటూ పొరుగింటివారు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. భావ్‌నగర్‌ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన నీతాబెన్‌ సర్వాయియా (35) తాము పెంచుకుంటున్న శునకానికి సోను అని పేరుపెట్టారు. అయితే ఈ విషయంపై ఆగ్రహించిన పొరుగింటివారు.. మంగళవారం నీతాబెన్‌ ఒంటరిగా ఉండటాన్ని గమనించి వారింట్లోకి బలవంతంగా చొరబడ్డారు.

తన భార్య ముద్దుపేరు 'సోను' అని.. ఆ పేరు కుక్కకు ఎలా పెడతారు అని సురాభాయ్‌ భర్వాద్‌ అనే పొరుగింటి వ్యక్తి నీతాబెన్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆమె వంటగదిలోకి వెళ్లగా వెంబడించిన ముగ్గురు వ్యక్తులు అక్కడి కిరోసిన్‌ డబ్బాను తీసుకొని, ఆమెపై పోసి నిప్పంటించారు. మంటలంటుకొని బాధితురాలు కేకలు వేయగానే.. వారు అక్కడినుంచి పారిపోయారు. ఆమె అరుపులతో ఇంట్లోకి వచ్చిన స్థానికులు మంటలను ఆర్పి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో భావ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేనిసమయంలో ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించారని, దర్భాషలాడారని సదరు బాధితురాలు పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. వంటింట్లోకి వెళ్లగా అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు తెలిపింది. ఆమె పిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ కుటుంబాలకు పలు వివాదాలు జరిగినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

యూట్యూబ్​లో చూసి భార్యకు ప్రసవం​.. చివరికి ఇలా!

వేగంగా వచ్చి మహిళలను ఈడ్చుకెళ్లిన కారు- ఇద్దరు దుర్మరణం

బాలిక​పై ఆటో డ్రైవర్​ అత్యాచారం.. యూపీలో మరో ఇద్దరు మైనర్లపై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.