Woman Raped Inside Bus: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు పోలీసులు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బస్సు కుక్షి నుంచి మనవర్‌కు వెళ్తుండగా.. బాధితురాలు లాంగ్‌సారిలో దిగాల్సి ఉంది. కానీ డ్రైవర్, క్లీనర్ ఆమెను అక్కడ దింపలేదు. బస్సులో ఉన్నవారు నిలదీయగా.. సమీపంలోని గంధవాణి ప్రాంతంలో దింపుతామని చెప్పారు. ఆ స్టేజీ వచ్చేసరికి బస్సు ఖాళీ అయిపోయింది. ఈ క్రమంలో నిర్జన ప్రాంతంలో బస్సు ఆపి డ్రైవర్, కండక్టర్‌తో సహా మరో వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో మహిళ అరుపులు విని బాటసారులు ఆమెను రక్షించారు. నిందితులను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. ఓ వ్యక్తి తప్పించుకోగా.. అతని కోసం గాలింపు జరుగుతోంది.
ఇదీ చదవండి: తాగొచ్చి.. విద్యార్థిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన టీచర్!