Woman Passenger Ruckus in Flight: మధ్యప్రదేశ్ ఇందోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు రచ్చరచ్చ చేసింది. 6e6013 నంబర్ కలిగిన విమానం ఇందోర్ నుంచి దిల్లీకి బయలుదేరాల్సి ఉంది. విమానం గాల్లోకి ఎగరడానికంటే కొద్ది క్షణాల ముందు సిబ్బందితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. దీంతో విమానాన్ని సిబ్బంది నిలిపివేశారు. ప్యాసింజర్ కుమార్తె మానసిక స్థితి సరిగా లేదని తోటి ప్రయాణికులు తెలిపారు. వివాదం సద్దుమణిగాక.. 40 నిమిషాలు ఆలస్యంగా విమానం బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
ఇదీ చదవండి: బస్సును ఢీకొట్టిన బైక్.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం