ETV Bharat / bharat

సైబర్​ నేరగాడి చేతిలో మోసపోయిన మహిళ.. ట్రిపుల్ తలాక్​ చెప్పిన భర్త

దేశంలో రోజురోజుకు సైబర్ మోసగాళ్లు పెరిగిపోతున్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. ఫేస్​బుక్​లో పరిచయమైన ఓ మహిళకు బంగారు వస్తువులు, ఏసీ, ఫ్రిడ్జ్ పంపిస్తానని మోసం చేశాడు ఓ వ్యక్తి. అందుకు కొరియర్ ఛార్జీలకు డబ్బులు పంపమని కోరాడు. డబ్బులు పంపాక ముఖం చాటేశాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి ఏం చేశాడంటే?

triple talaq case kendrapara
triple talaq case kendrapara
author img

By

Published : Apr 8, 2023, 5:58 PM IST

సైబర్​ మోసగాడి చేతిలో మోసపోయింది ఓ మహిళ. ఆమె దగ్గర నుంచి రూ.1,70,000 వేలు కాజేశాడు నిందితుడు. డబ్బు మోసపోవడమే గాక ఆమె జీవితం కూడా నాశనమైంది. సైబర్ మోసగాడి చేతిలో మోసపోయిన మహిళకు ఆమె భర్త ఫోన్​లో త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపాడా జిల్లాలో జరిగింది.

అసలేమైందంటే?
మీర్జాపట్న గ్రామానికి చెందిన జమ్రున్ బీబి అనే ముస్లిం మహిళకు ఫేస్​బుక్​లో రవి శర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. జమ్రున్ బీబిని సోదరి అని సంభోదించేవాడు రవిశర్మ. కాగా.. తన స్వస్థలం ఝార్ఖండ్ అని.. ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జీవిస్తున్నానని రవి శర్మ.. జమ్రున్​తో చెప్పాడు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి అతడి పట్ల బాగా నమ్మకం కలిగేటట్లు చేశాడు. దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారు నెక్లెస్​, ఫ్రిడ్జ్​, ఐఫోన్​, ఏసీ వంటి ఖరీదైన వస్తువులు పంపుతానని ఆమెను నమ్మించాడు. అవి పంపేందుకు దాదాపు రూ.1.70లక్షలు కొరియర్ ఛార్జీలు అవుతాయని జమ్రున్​ బీబిని మభ్య పెట్టాడు.

అయితే రవి శర్మ మాటలను నమ్మేసిన జమ్రున్​.. తన నెక్లెస్​ను బ్యాంకులో తాకట్టుపెట్టి అతడికి రూ.60 వేలు పంపింది. విడతల వారీగా ఆమె నుంచి రూ.1,70,000 కాజేశాడు రవి శర్మ. అయితే ఎప్పటికీ నిందితుడు రవి పంపుతాన్న వస్తువులు రాకపోవడం వల్ల నిరాశపడింది జమ్రున్​. దీంతో పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు రవి శర్మపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

.
నిందితుడు

త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
అయితే, జమ్రున్​.. ఫేస్​బుక్​లో పరిచయమైన రవి శర్మకు రూ. 1,70,000 పంపిన విషయం గుజరాత్​లో ఉంటున్న ఆమె భర్త రజీద్​కు తెలిసింది. దీంతో అతడు జమ్రున్​పై ఫోన్​లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం ఆమెకు ఫోన్​లోనే త్రిపుల్ తలాక్ చెప్పాడు. సైబర్ నేరగాడి కారణంగా.. జమ్రూన్​, రజిద్ 18 ఏళ్ల వివాహ బంధం వీడిపోయింది. దీంతో త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త రజిద్​పై కూడా జమ్రున్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆర్మీ అధికారుల పేరుతో..
ఇటీవల.. సైబర్ నేరగాళ్లు అమాయకుల బలహీనత, అత్యాశను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. మరికొందరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ అధికారుల పేరుతో స్కానింగ్ యంత్రాలు కావాలంటూ ఫార్మా కంపెనీకి టోకరా పెట్టారు. ఆర్మీ రూల్స్ ప్రకారం ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చేయాలని నమ్మబలికారు. ఫార్మా కంపెనీ బలహీనతను ఆసరాగా చేసుకుని విడతల వారిగా 25 లక్షల రూపాయలు దండుకున్నారు. ఆ డబ్బు తమకు రాలేదని మళ్లీ పంపాలనడంతో కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చింది. తాను మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.