వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ వివాహిత. ఆ తర్వాత శవాన్ని వంటింట్లోనే పూడ్చిపెట్టింది. ముంబయిలోని దహిసర్ (ఈస్ట్)లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుడి కుమార్తె ఆమె బంధువుకు ఇచ్చిన సమాచారంతో ఈ హత్య గురించి తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు వెల్లడించారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేయగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి : గ్యాంగ్ రేప్ కేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు!