ETV Bharat / bharat

పాత కక్షలతో మహిళపై సామూహిక అత్యాచారం!

ఉత్తర్​ప్రదేశ్​లోని మేరట్​ జిల్లాలో ముగ్గురు దుండగులు ఓ వివాహితను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్తతో నిందితులకు ఉన్న పాత కక్షలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

woman, up, rape
మేరట్​​లో వివాహితపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Mar 1, 2021, 10:47 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మేరట్​​ జిల్లా ఖర్​ఖోడా ప్రాంతంలో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. శనివారం రాత్రి ముగ్గురు దుండగులు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు అదే గ్రామానికి చెందిన నోఫిల్​, అక్బర్​, ఇర్ఫాన్లగా పోలీసులు గుర్తించారు.

"బాధితురాలి భర్త షహజాద్​ అలియాస్​ పాషాకు, నిందితులకు ఎప్పటి నుంచో వైరం ఉంది. షహజాద్​ కొన్ని నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో వారు అతని భార్యపై అత్యాచారం చేశారని మేము భావిస్తున్నాము. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాము."

-పోలీసులు

అసలేం జరిగిందంటే..

శనివారం రాత్రి 9 గంటలకు బాధితురాలి ఇంట్లోకి నిందితులు చొరబడ్డారు. దుండగులు ఆమెను బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బాధితురాలి అత్త వారిని అడ్డుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో నిందితులు ఆమెపై కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం విని ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకునే సమయానికి నిందితులు బాధితురాలితో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన అత్తను ఆస్పత్రికి తరలించి.. బాధితురాలి కోసం గాలింపు చేపట్టారు.

బాధితురాలిని కారులో శివార్లలోని శ్మశానానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె కాళ్లు, చేతులను బంధించి రోడ్డుపై పడేసి పరారయ్యారు. కొన్ని గంటల గాలింపు తర్వాత పోలీసులు బాధితురాలిని గుర్తించారు. ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్విహించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసుుల దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చదవండి : 'కాంగ్రెస్ బలపడాలన్నదే నా ఆకాంక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.