ETV Bharat / bharat

పురిటి నొప్పులు ఆగవు.. దారేమో కనిపించదు! - అడవిలోనే ప్రసవించిన మహిళ

ఆ తల్లి పురిటి నొప్పుల బాధను చూసి అడవి నిశ్శబ్దంగా రోధించింది. అభివృద్ధి చెందుతున్న సమాజానికి మహిళ పెడుతున్న అరుపులు వినిపించట్లేదా అని హీనంగా వెక్కిరించింది. ఆ అతివ పడుతున్న యాతన చూడలేక.. తన పచ్చని ఒడిలోనే పండంటి బిడ్డకు ప్రసవం పోసింది. ఇదేదో.. బీసీ కాలపు నాటి కథ కాదండీ.. కేరళలోని పతనంతిట్ట జిల్లా చలకాయమ్​ అటవీ ప్రాంతంలో ఇప్పుడు జరిగిన వాస్తవ ఘటన.

tribal women gave birth in kerala
అడవిలోనే ప్రసవించిన మహిళ
author img

By

Published : May 26, 2021, 6:01 PM IST

పతనంమిట్ట అటవీ ప్రాంతంలో ప్రసవించిన మహిళ

నడిచేందుకే సరైన దారి లేని ఆ అరణ్యానికి అంబులెన్సులు మైలు దూరంలోనే నిలిచిపోయాయి. గుండెను సైతం మార్చేంతగా.. అభివృద్ధి చెందిన వైద్య సదుపాయాలు ఆ తల్లికి పురుడు పోసేందుకు కిలోమీటర్ల ఆవలే ఆగిపోయాయి. గిరిజన మహిళల ప్రసవ వేదనకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది పచ్చని అడవి.

tribal women gave birth in kerala
అడవిలోనే ప్రసవించిన మహిళ

కేరళలోని పతనంతిట్ట జిల్లాలో చలకాయమ్​ అటవీ ప్రాంతంలో మలమ్​బందారమ్​ తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. తెగలో ఓ మహిళకు నెలలు నిండుకున్నాయి. ఒక్కసారిగా నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆస్పత్రికి చేరుకోవడానికి గర్భిణీని తీసుకొని కుటుంబీకులు బయలుదేరారు. సరైన దారిలేని కొండ ప్రాంతాల్లో నడవగా.. మహిళకు నొప్పులు మరింతగా ఎక్కువయ్యాయి. అడవి మధ్యలోనే ఆ మహిళ ప్రసవించింది.

సమాచారం అందుకున్న వైద్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తల్లీబిడ్డలిద్దరికీ పరీక్షలు చేసి.. క్షేమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు

:రూటు మార్చిన దొంగలు- హెల్మెట్ ధరించి దోపిడీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.