బంగాల్ ఖరగ్‌పూర్‌లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువకుడు ఓ మహిళను నమ్మించి మోసంచేశాడు. ఆ గొడవకు పరిష్కారం చూపిస్తానన్న స్థానిక టీఎంసీ కౌన్సిలర్.. ఆమెను పార్టీ కార్యాలయానికి పిలిపించి అత్యాచారం చేసాడు. ఘటన జరిగిన మూడు నెలలు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే?
బంగాల్ పశ్చిమ మదీన్పుర్ జిల్లాలోని ఖరగ్‌పూర్‌కు చెందిన ఓ మహిళ ఐదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయి.. తండ్రితో కలిసి ఒంటిరిగా జీవనం సాగిస్తుంది. అయితే.. ఆమె గత కొంత కాలంగా స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై పలు మార్లు అత్యాచారం చేసి అనంతరం ముఖం చాటేశాడు. ఈ గొడవకు పరిష్కారం చూపిస్తాని స్థానిక టీఎంసీ కౌన్సిలర్ ముఖేశ్ హుమ్నే జూలై 25న తన పార్టీ కార్యాలయానికి పిలిపించాడు. ఆ పంచాయితికి ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితుడు కూడా హాజరయ్యాడు. పరిష్కారం చూపిస్తానన్న పెద్ద మనిషితో సహా ఆ ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తామని ఆమెను బెదిరించాడు.
అయితే.. ఈ ఘటన జరిగి మూడు నెలలు కాగా.. తాజాగా మదీన్పూర్ ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ముఖేశ్ కొన్ని రోజుల క్రితం భాజపా నుంచి తృణమాల్ కాంగ్రెస్‌లోకి మారిపోయాడు. పార్టీ మారిన నుంచే.. అతడికి ఆ పార్టీ అలవాట్లు వచ్చాయని.. కౌన్సిలర్ని కఠినంగా శిక్షించాలని భాజపా జిల్లా ప్రతినిధి అరూప్ దాస్ డిమాండ్ చేశారు.
విద్యార్థిపై కాల్పులు..
రాజస్థాన్ ధోల్‌పుర్ ఓ మైనర్ తుపాకీతో హల్చల్ సృష్టించాడు. మొరోలి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రామ్హరి అనే ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆ యువకుడు పారిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన.. రాంబరన్ అనే వ్యక్తి కుమారుడు సచిన్‌గా గుర్తించారు. అయితే ఆ విషయంపై బాధితుడు వాంగ్మూలం తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు.. వారి ఇద్దరి మధ్య ఏదైనా వివాదం ఉందా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
పశుగ్రాసం గొడవ.. దళిత కుటుంబంపై దాడి..
ఉత్తర్ ప్రదేశ్‌లో 12 మంది గ్యాంగ్స్టర్స్ కలిసి ఓ దళితుడి ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. కాన్పూర్‌లోని బిల్హౌర్ ప్రాంతంలోని చక్తాపూర్ గ్రామంలో.. పశుగ్రాసం విషయంలో ఓ దళిత కుటుంబానికి, మరొకరికి మధ్య గొడవ జరిగింది. పోలీసులు సైతం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.