ETV Bharat / bharat

పంచాయతీ ఆఫీస్​లో యువతిపై పెట్రోల్​ పోసి.. తానూ!

man sets fire to woman: పంచాయతీ కార్యాలయంలో పని చేసే ఓ మహిళా ఉద్యోగిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. అనంతరం తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఇరువురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అధికారులు తెలిపారు.

Woman employee of panchayat office dies after man sets her afire, himself
చనిపోయిన పంచాయతీ కార్యాలయం ఉద్యోగి
author img

By

Published : Dec 18, 2021, 6:58 AM IST

Updated : Dec 18, 2021, 11:04 AM IST

man sets fire to woman: కేరళలో దారుణం జరిగింది. యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. కోజికోడ్​ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేసే ఆమెను చంపి.. తానూ నిప్పంటించుకున్నాడు. ఇరువురికి తీవ్రంగా గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతు ఆ యువతి మరణించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. తిక్కోడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. బాధితురాలు కంప్యూటర్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని నాలుగు రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా చేరిందని వివరించారు.

ఒకే ప్రాంతంలో ఉంటూ..

నిందితుడు తిక్కోడికి చెందిన నందకుమార్​(26)గా పోలీసులు గుర్తించారు. దారుణానికి పాల్పడటానికి గల కారణాలేంటి? అన్న విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. యువతీయువకుడికి ఇదివరకే పరిచయం ఉందని, ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కొవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యం- రాష్ట్రాలపై సుప్రీం అసహనం

Last Updated : Dec 18, 2021, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.