ETV Bharat / bharat

మహిళా డీఎస్​పీకి ఆకతాయిల వేధింపులు.. పోలీసుల సమక్షంలోనే! - మహిళా డీఎస్​పీపై వేధింపులు

Woman DSP Molested: మహిళా డీఎస్​పీపై కొందరు ఆకతాయిల వేధింపుల ఉదంతం ఝార్ఖండ్​ రాంచీలో వెలుగుచూసింది. ఆ యువకులకు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా సహకరించినట్లు ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman DSP molested in Ranchi
Woman DSP molested in Ranchi
author img

By

Published : Feb 9, 2022, 1:46 PM IST

Woman DSP Molested: పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే ఘటన ఒకటి ఝార్ఖండ్​ రాంచీలో జరిగింది. ఏకంగా మహిళా డీఎస్​పీనే కొందరు ఆకతాయిలు ఆట పట్టించారు. రాత్రి సమంయలో ఆమెను వేధించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా యువకులను రెచ్చగొడుతూ.. డీఎస్​పీని రక్షించకుండా వ్యవహరించారని తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

రాంచీ ఓల్డ్​ పోలీస్​ లైన్​ సమీపంలో.. సోమవారం రాత్రి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు జరుగుతోంది. అసభ్యకర డీజే పాటలకు మద్యం మత్తులో ఉన్న యువకులు చిందులు వేస్తున్నారు. సమాచారం అందుకున్న మహిళా డీఎస్​పీ అక్కడికి చేరుకొని.. పాటలు ఆపేసి, వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన యువత.. ఆమెపై వేధింపులకు దిగారు. అసభ్యంగా ప్రవర్తించారు.

ఈ క్రమంలోనే ఒక యువకుడిని చెంపదెబ్బ కొట్టారు డీఎస్​పీ. వెంటనే అక్కడున్న 15 మంది ఆమె చుట్టూ గుమికూడి అల్లరి చేశారు. పక్కనే ఉన్న ఇద్దరు పోలీస్​ కానిస్టేబుళ్లు వినోద్​ పాండే, సీపీ ఉపాధ్యాయ్​ రక్షించడం మాని.. వారికి సహకరించారని ఆమె ఆరోపించారు. ఆ ఇరువురూ యువకులను ఇంకా రెచ్చగొట్టారని మహిళా డీఎస్​పీ.. లోయర్​ బజార్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సంబంధిత వీడియోను కూడా సమర్పించారు.

మొత్తం 15 మంది గుర్తుతెలియని యువకులు సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి: కులమతాలే ప్రచారాస్త్రాలు- మౌలిక సమస్యల ప్రస్తావనే లేదు!

'బికినీ, జీన్స్​, హిజాబ్​.. అంతా మా ఇష్టం! మధ్యలో మీరెవరు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.