Woman Dropped Diamond Ring In Bathroom Commode : ఎంత ఖరీదైన వస్తువైనా.. కొన్నిసార్లు ఏదో ఒకచోట పెట్టి మర్చిపోవడం సహజం. ఇలా ఓ మహిళ రూ.50 లక్షల విలువైన డైమండ్ ఉంగరాన్ని మర్చిపోయింది. తీరా విషయం గుర్తొచ్చాక.. మర్చిపోయిన చోటుకు వెళ్లి చూస్తే.. ఉంగరం కనిపించలేదు. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే.. పోలీసులకు భయపడి ఉంగరాన్ని కొట్టేసిన యువతి దాన్ని కాస్తా బాత్‌రూం కమోడ్‌లో విసిరేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని ఎఫ్‌ఎంసీ దంత, చర్మ ఆసుపత్రికి చికిత్స కోసం జంజారాహిల్స్‌కు చెందిన నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు వెళ్లింది. చికిత్స సమయంలో చేతికి ఉన్న రూ.50 లక్షల విలువైన డైమండ్ రింగ్‌ను తీసి.. పక్కన పెట్టింది. చికిత్స అనంతరం ఆ ఉంగరం మరచిపోయి.. అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆలస్యంగా ఉంగరం విషయం గుర్తొచ్చి వెతకడం ప్రారంభించింది.
Woman Forgot Rs 50 Lakh Diamond Ring : ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లినప్పుడు పక్కన పెట్టి మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూసింది. ఉంగరం కనిపించకపోయేసరికి అక్కడి సిబ్బందిని నిలదీసింది. ఆస్పత్రి సిబ్బంది తమకు తెలియదని.. తాము తీయలేదని సమాధానం చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆస్పత్రి మొత్తాన్ని శోధించిన పోలీసులు.. సీసీ కెమెరాలను తనిఖీ చేశారు.
ఉచిత సిలిండర్ ఇస్తానని నమ్మించాడు.. వృద్ధురాలి బంగారం దోచేశాడు...
అప్పుడు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం లభించకపోవడంతో.. సిబ్బందిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. లాలస అనే మహిళా సిబ్బంది తన పర్సులో ఎవరో టిష్యూ చుట్టి ఉంగరాన్ని పెట్టేశారని.. భయంతో తానే డైమండ్ రింగ్‌ను బాత్‌రూం కమోడ్‌లో విసిరేసినట్లు ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో బాత్‌రూం కమోడ్ను తవ్వి ఉంగరాన్ని పోలీసులు వెలికి తీశారు. ఆ తర్వాత లాలసను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు.
ఇవీ చదవండి :