ETV Bharat / bharat

మహిళా డాక్టర్​ ఆత్మహత్య.. పెళ్లైన 6 నెలలకే.. ఏం జరిగింది? - నీట్​పై భయం

Woman Doctor Dies: ఓ యువ వైద్యురాలు పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు, కోయంబత్తూర్​లో జరిగింది. పీజీ నీట్​కు సన్నద్ధమవుతుందని, ఆ భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

Woman Doctor dies
మహిళా డాక్టర్​ ఆత్మహత్య
author img

By

Published : May 20, 2022, 5:18 PM IST

Woman Doctor Dies: పెళ్లి చేసుకున్న 6 నెలలకే ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు, కోయంబత్తూర్​లో జరిగింది. రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్​ పూర్తి చేసిన యువతి.. 'పీజీ నీట్​'కు సన్నద్ధమవుతుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలేంటి?
జిల్లాలోని మెట్టుపాలయమ్​కు చెందిన రాశి (27).. 2020లో ఎంబీబీఎస్​ పూర్తి చేసింది. పీజీ నీట్​కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం టెక్స్​టైల్​ షాప్​ నిర్వహిస్తున్న అభిషేక్​ను ​(30) వివాహం చేసుకుంది. అయితే, కొద్ది రోజులుగా నీట్​ పరీక్షపై ఆందోళన చెందుతున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం బాధితురాలి తల్లి సెంతమరై​.. రాశి గది డోర్​ కొట్టగా స్పందించలేదు. ఏం జరిగిందోనని కిటికీలోంచి చూడగా.. ఆత్మహత్య చేసుకుని కనిపించింది. వెంటనే మెట్టుపాలయమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ ​మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: గన్​తో బెదిరించి రేప్​.. పెళ్లి చేసుకొని రూ.5 లక్షలు, బైక్​ డిమాండ్​​​!

భార్యతో గొడవ.. సిలిండర్​ పేల్చుకుని భర్త మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.