Woman Deliver Baby On Road In Uttar Pradesh : అంబులెన్సు రావడం ఆలస్యమవడం వల్ల రిక్షాలో ఆస్పత్రికి తరలించిన గర్భిణీ రోడ్డుపైనే ప్రసవం అయింది. దీంతో నవజాత శిశువు అక్కడే మృతిచెందింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని రాజ్‌భవన్ ఎదురుగా జరిగింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.
ఇదీ జరిగింది..
లఖ్‌నవూలోని మాల్ అవెన్యూ ప్రాంతంలో రూప అనే 5 నెలల గర్భిణీ నివసిస్తోంది. అయితే డెలివరీ సమయం రాకముందే ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో అంబులెన్సుకు ఫోన్ చేశారు రూప కుటుంబ సభ్యులు. పలుమార్లు ప్రయత్నించినా అంబులెన్సు రాలేదు. చేసేదేమి లేక గర్భిణీని రిక్షాలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై.. మహిళ రోడ్డు పక్కనే ప్రసవం అయింది. ఈ ఘటన రాజ్‌భవన్ 15వ నంబర్ గేటు ముందు జరిగింది. ప్రసవం అయిన కొద్దిసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. అనంతరం మహిళను ఝల్కారీ ఆస్పత్రికి తరలించారు. అయితే, శిశువు అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. మహిళకు ప్రీ మెచ్యూర్ డెలివరీ అయిందని చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్.. మహిళ భర్తతో ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం, శిశువు మృతదేహంతో బాధితురాలి భర్తను తన కారులో శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ శిశువును పూడ్చిపెట్టారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని బ్రజేస్ హామీ ఇచ్చారు. అయితే, అంబులెన్స్ ఆలస్యంగా వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతను ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పగించామని తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర రాజధానిలోనే ఈ దుర్ఘటన జరగడం వల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యోగి పాలనలో ఆరోగ్య రంగం నిర్లక్ష్యానికి గురైందని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ- ఎస్పీ నిప్పులు చెరిగింది. ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉందని బీజేపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు ఎస్పీ నేత శివపాల్ యాదవ్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
-
सूबे की स्वास्थ्य व्यवस्था अपने लाख विज्ञापनों व दावों के बावजूद वेंटिलेटर पर है। एम्बुलेंस न मिलने पर रिक्शे से अस्पताल जा रही गर्भवती महिला को राज भवन के पास सड़क पर प्रसव के लिए मजबूर होना पड़े तो यह पूरी व्यवस्था के लिए शर्मनाक व सूबे की स्वास्थ्य व्यवस्था की असल हकीकत है। pic.twitter.com/ebEsBFwVsO
— Shivpal Singh Yadav (@shivpalsinghyad) August 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">सूबे की स्वास्थ्य व्यवस्था अपने लाख विज्ञापनों व दावों के बावजूद वेंटिलेटर पर है। एम्बुलेंस न मिलने पर रिक्शे से अस्पताल जा रही गर्भवती महिला को राज भवन के पास सड़क पर प्रसव के लिए मजबूर होना पड़े तो यह पूरी व्यवस्था के लिए शर्मनाक व सूबे की स्वास्थ्य व्यवस्था की असल हकीकत है। pic.twitter.com/ebEsBFwVsO
— Shivpal Singh Yadav (@shivpalsinghyad) August 13, 2023सूबे की स्वास्थ्य व्यवस्था अपने लाख विज्ञापनों व दावों के बावजूद वेंटिलेटर पर है। एम्बुलेंस न मिलने पर रिक्शे से अस्पताल जा रही गर्भवती महिला को राज भवन के पास सड़क पर प्रसव के लिए मजबूर होना पड़े तो यह पूरी व्यवस्था के लिए शर्मनाक व सूबे की स्वास्थ्य व्यवस्था की असल हकीकत है। pic.twitter.com/ebEsBFwVsO
— Shivpal Singh Yadav (@shivpalsinghyad) August 13, 2023