ETV Bharat / bharat

మద్యానికి బానిసైన భర్త.. డబ్బుల కోసం గొడవ.. భార్యను చంపి అల్మరాలో.. - కోడలిని హత్యచేసిన అత్తమామలు ట

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. భార్యను హతమార్చి ఆమె మృతిదేహాన్ని ఇంటి అల్మరాలో ఉంచాడు. ఈ ఘటన బంగాల్​లో వెలుగుచూసింది. మరోవైపు, అదనపు కట్నం కోసం కోడలిని హత్య చేసి చెరువులో పడేశారు ఆమె అత్తమామలు.

woman decomposing body found on cupboard
హత్య
author img

By

Published : Dec 10, 2022, 9:04 PM IST

బంగాల్ హూగ్లీలో దారుణం జరిగింది. ఓ ఇంటి ఆల్మరాలో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని భారతి(62)గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మృతురాలి భర్త, కుమారుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిసురాలో మృతురాలు భారతి తన భర్త కాశీనాథ్​తో కలిసి జీవించేది. మృతురాలు స్థానిక ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేస్తోంది. వీరి కుమారులు వేరే కాపురం ఉంటున్నారు. కాశీనాథ్.. మద్యానికి బానిసై డబ్బుల కోసం తరచుగా భార్యతో గొడవలు పడేవాడు. దీంతో కుటుంబ కలహాల కారణంగా కాశీనాథ్ అతడి భార్య భారతిని హత్య చేసి ఇంటి అల్మరాలో ఉంచాడు. గురువారం ఉదయం స్థానికులకు భారతి ఆఖరిసారిగా కనిపించింది. మృతురాలి కుమారుడు విశ్వనాథ్.. బట్టల కోసం ఇంటి అల్మరా తెరిచి చూడగా తల్లి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కుళ్లిన స్థితిలో ఉన్న భారతి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అదనపు కట్నం కోసం..
బిహార్​ ఛప్రాలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం కోడలిని హత్య చేశారు ఆమె అత్తమామలు. అనంతరం బాధితురాలి మృతదేహం చెరువులో పడేశారు. మృతురాలిని కాజల్ దేవిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతురాలు కాజల్​కు.. పంకజ్​ మహతో అనే వ్యక్తితో ఎనిమిది నెలల క్రితం పెళ్లయింది. పెళ్లైనప్పటి నుంచి కాజల్ అత్తమామలు ఆమెను అదనపు కట్నం వేధించడం మొదలుపెట్టారు. వారం రోజుల క్రితం బాధితురాలి చేతిని కోసి ఆ భయానక దృశ్యాలను ఆమె తండ్రికి పంపారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన కాజల్ ఆఖరికి తాజ్​పుర్​ గ్రామంలోని ఓ చెరువులో విగతజీవిగా కనిపించింది. నిందితులపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

మూడేళ్ల చిన్నారిపై..
మహారాష్ట్ర ఉస్మానాబాద్​లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు ఆనంద్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.