ETV Bharat / bharat

'నేను వీడియోకాల్​ లైవ్​లో చూస్తా.. నీ భార్యను కొట్టు​'.. ప్రియురాలి పైశాచికత్వం! - ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రా క్రైమ్ న్యూస్

ప్రియురాలి మోజులో పడిన ఓ వ్యక్తి భార్యపై దాడికి పాల్పడుతున్నాడు. వీడియో కాల్​ చేసి భార్యను కొట్టమని అతడిని ప్రియురాలు ప్రోత్సహిస్తోంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. భర్త, అతడి ప్రియురాలు, ఆమె తల్లిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

woman case against husband
భార్యను దాడి చేస్తున్న భర్త
author img

By

Published : Nov 25, 2022, 11:58 AM IST

తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని.. ప్రియురాలి ఆదేశాలతో తనను తీవ్రంగా కొడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. భర్త, అతడి ప్రియురాలు, ఆమె తల్లిపై కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు.. దాడికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేసింది. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితురాలికి భర్త నుంచి హాని ఉందన్న నేపథ్యంలో భద్రతను సైతం కల్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆగ్రాకు చెందిన ఓ మహిళకు రాబిన్​ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. సంతోషంగా సాగిపోతున్న వీరి కాపురంలోకి ఓ మహిళ చిచ్చుపెట్టింది. భర్తను వదిలేసి విడిగా ఉంటున్న హరిపర్వత్​కు చెందిన ఓ మహిళ.. రాబిన్​కు పరిచయమైంది. తన భర్తతో జరుగుతున్న గొడవలు గురించి రాబిన్​కు చెప్పింది. ఆ మహిళకు రాబిన్ రూ.1,000 సాయం చేశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఇంకా పెరిగి.. ఫోన్​లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది.

నా భర్త ఇంటికి రావడం మానేశాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. పిల్లలను కూడా కనీసం పట్టించుకోవట్లేదు. నా భర్త రాబిన్ ఇంటికి వచ్చేటప్పుడు.. అతడి ప్రియురాలి వీడియో కాల్ చేసి నన్ను కొట్టమని ప్రోత్సహిస్తోంది. నా భర్త ప్రియురాలు, ఆమె తల్లి యువకులను ట్రాప్ చేసి.. డబ్బులు గుంజుకుంటున్నారు. యువకులతో సన్నిహితంగా ఉండి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వమని చెబితే.. అత్యాచారం కేసు పెడతారు. వారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంతకుముందు వారు ఓ యువకుడు, ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి, మరొ ఇద్దరు వ్యక్తులపై అత్యాచారం కేసులు అన్యాయంగా పెట్టారు.

--బాధితురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.