కర్ణాటకలో భారీ స్థాయిలో పసిడిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మంగళూరు విమానాశ్రయంలో ఓ మహిళ లోదుస్తుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. అధికారుల తనిఖీల్లో పట్టుబడింది. మొత్తం 2.41 కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు.. దీని విలువ సుమారు రూ.1.10 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు.
ఇలా దొరికింది..
కాసరగోడ్‌కు చెందిన సమీరా అనే ప్రయాణికురాలు.. దుబాయ్ నుంచి మంగళూరు విమానాశ్రయంలో దిగింది. ఆమెను తనిఖీ చేయగా.. శానిటరీ ప్యాడ్లు, సాక్స్‌లు, లోదుస్తుల్లో ఈ బంగారం వెలుగుచూసింది. పసిడితో పాటు విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోట్పా(సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం) కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు