ఉత్తర్‌ప్రదేశ్.. సహరాన్‌పుర్‌లో దారుణం జరిగింది. గర్భిణీపై నలుగురు వ్యక్తులు దాడి చేయడం వల్ల ఆమెకు గర్భస్రావం అయింది. బాధితురాలు దేవ్‌బంద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: జనవరిలో 24 ఏళ్ల మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని, అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి నిందితుడు బాధితురాలిని లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఓసారి దేవ్‌బంద్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నిర్భందించి.. అతని ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భవతి అయినప్పుడు నిందితులు చంపడానికి ప్రయత్నించారు. జూన్ 25న ఆమె వారి నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. జూన్ 26న నలుగురు నిందితులు మళ్లీ బాధితురాలిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది.
ఇవీ చదవండి: ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య.. అదే కారణమా?
గన్‌తో ఆడుతూ ట్రిగ్గర్ నొక్కిన బాలుడు.. రెండేళ్ల చిన్నారి మృతి