ETV Bharat / bharat

వైన్ షాపుల వద్ద మందుబాబుల బారులు

ఉత్తర్​ప్రదేశ్​లో పలు చోట్ల మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మందుబాబులు దుకాణాల ముందు క్యూ కట్టారు. కరోనా ఆంక్షల కారణంగా మే 3 నుంచి 10 వరకు అక్కడ మద్యం దుకాణాలు తెరవలేదు.

wines shops opened in utterpradesh, people queued up in lines
మధ్యం షాపుల ముందు మందుబాబుల బారులు
author img

By

Published : May 11, 2021, 5:42 PM IST

కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఉత్తర్​ప్రదేశ్​లో కర్ఫ్యూను మే 17 వరకు పొడిగించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అయితే వ్యాపారుల వినతి మేరకు ఈసారి పలు చోట్ల మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో వారం రోజులుగా మద్యానికి దూరమైన మందుబాబులు వైన్​​ షాపుల ముందు క్యూ కట్టారు.

wines shops opened in utterpradesh, people queued up in lines
మద్యం షాపుల ముందు మందుబాబుల బారులు

కొవిడ్​ కట్టడి కోసం మే 3 నుంచి ఆంక్షలు అమలు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ఆ తర్వాత మే 6 నుంచి 10 వరకు కర్ఫ్యూ కొనసాగించింది. తాజాగా మరో వారం రోజులు పొడిగించి మే 17 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. వారణాసి గౌతంబుద్ధనగర్​ సహా ఇతర ప్రాంతాల్లో ఈసారి మద్యం దుకాణాలు తెరిచేందుకు అంగీకరించింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు డైరీలు, కూరగాయల మార్కెట్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు తెరిచి ఉంటాయి.

పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రభుత్వ నిర్మాణాలు, హార్డ్​వేర్​ దుకాణాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం.

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 20,463 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 15,45,212కి చేరింది. మరో 306మంది వైరస్​కు బలి కాగా.. మొత్తం మృతుల సంఖ్య 16,043 పెరిగింది. అయితే గత 10 రోజుల్లేనే 94,000 మంది కోలుకోగా..యాక్టివ్​ కేసుల సంఖ్య 2,16,057కి దిగొచ్చింది.

ఇదీ చూడండి: దేశం 'లాక్​డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.