ETV Bharat / bharat

'యూకేలో జాతివివక్షపై తగిన చర్యలు' - ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ఘటన

యూకేలో జాతివివక్ష ఘటనలపై అవసరం అయితే కఠిన చర్యలు చేపడతామని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఇటీవల ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయంలో భారత విద్యార్థి జాతివివక్షకు గురైన ఘటనను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

jai shankar
'జాతివివక్షను సహించేది లేదు'
author img

By

Published : Mar 15, 2021, 3:33 PM IST

యూకేలో జాతివివక్ష ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే కఠిన చర్యలు చేపడతామని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. జాతివివక్షపై పోరులో తప్పక గెలుస్తామని సోమవారం పార్లమెంటు వేదికగా వ్యాఖ్యానించారు.

ఇటీవల ఆక్స్​ఫర్డ్​ విశవిద్యాలయం విద్యార్థిపై జాతివివక్ష ఘటనను ప్రస్తావిస్తూ రాజ్యసభలో ఎంపీ అశ్వినీ వైష్ణవ్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఈ విధంగా స్పందించారు.

"యూకే ప్రతిష్ఠకు భంగం కలుగుతున్న ఉద్దేశంతో ఈ ఘటనలపై ఆచితూచి వ్యవహరిస్తున్నాము. యూకేతో భారత్​కు మంచి బంధం ఉంది. ఈ ఘటనలను పరిశీలిస్తున్నాము. అవసరమైతే వీటిని తీవ్రంగా పరిగణించి చర్యలు చేపడతాము. ఇది మహాత్మ గాంధీ పుట్టిన దేశం. కాబట్టి జాతివివక్షపై నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదు."

-జైశంకర్, విదేశాంగ మంత్రి

కర్ణాటక ఉడుపికి చెందిన రష్మీ సమంత్​ ఇటీవల ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే ఆమె సామాజిక మాధ్యమాల పోస్టులను తప్పుపడుతూ పలువురు జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేయాలని డిమాండ్​ చేయడం వల్ల ఆమె పదవి చేపట్టిన ఐదు రోజులకే బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

ఇదీ చదవండి : 'నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.