ETV Bharat / bharat

కాంగ్రెస్‌లో చేరనున్న ప్రశాంత్‌ కిశోర్‌?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)కు కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. భాజపాను ఓడించే లక్ష్యంతో.. పీకేకు పార్టీలో కీలక పదవిని అప్పగించాలని కాంగ్రెస్​ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

prashant kishore
ప్రశాంత్ కిశోర్​
author img

By

Published : Jul 30, 2021, 7:31 AM IST

Updated : Jul 30, 2021, 9:42 AM IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)కు కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇటీవల రాహుల్‌ గాంధీ సీనియర్‌ నాయకులైన కె.సి.వేణుగోపాల్‌, ఆనంద్‌ శర్మ, కమల్‌నాథ్‌, మల్లికార్జున ఖర్గే, ఎ.కె.ఆంటోనీ, అజయ్‌ మాకెన్‌, అంబికా సోని, హరీష్‌ రావత్‌లతో చర్చలు జరిపారు. ఆయన వస్తే కలిగే లాభనష్టాలపై బేరీజు వేశారు. ప్రశాంత్‌ కిశోర్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకునే ముందు సీనియర్లతో చర్చించాలని రాహుల్‌కు తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.

భాజపాను ఓడించాలంటే...

భాజపాను ఓడించడానికి ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన కొన్ని సూచనలపై కాంగ్రెస్​లోని సీనియర్లు కూడా అంగీకారం తెలిపినట్టు తెలిసింది. భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా కనీసం 136 సీట్లను గెలవాల్సి ఉంటుందని, ఇతర పార్టీలతో జత కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదని, అన్ని పార్టీలు ఏకం కావడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌, సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ తదితరులతో భేటీ అయ్యారు.

ఇదీ చూడండి: పెగసస్​పై కేంద్రం, రాహుల్ మధ్య మాటల యుద్ధం!
ఇదీ చూడండి: పెగసస్​పై సీజేఐ జోక్యం కోరుతూ.. 500 మంది లేఖ

Last Updated : Jul 30, 2021, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.