ETV Bharat / bharat

'ప్రధానితో పాటు మా ఆత్మగౌరవం కూడా ముఖ్యమే'

చర్చలకు ఫోన్​కాల్​ దూరంలోనే ప్రభుత్వం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రైతుల నేత నరేశ్​ తికాయత్​ స్పందించారు. ప్రధాని గౌరవానికి విలువనిస్తామని.. అదే సమయంలో తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. అనుకూల వాతావరణంలో చర్చలు జరగాలన్నారు.

farmer protest
'ప్రధాన మంత్రి హుందాతనాన్నిమేం గౌరవిస్తాం'
author img

By

Published : Jan 31, 2021, 3:06 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. ప్రధానమంత్రి గౌరవానికి విలువనిస్తారని భారతీయ కిసాన్​ యూనియన్​ జాతీయ అధ్యక్షుడు నరేశ్​ తికాయత్​ తెలిపారు. అదే సమయంలో తమ ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి కూడా కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. రైతులతో చర్చలు జరిపేందుకు ఫోన్​కాల్​ దూరంలోనే తమ ప్రభుత్వం ఉందని మోదీ అన్న మాటల నేపథ్యంలో నరేశ్​ తికాయిత్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"ప్రధానమంత్రి గౌరవానికి మేము విలువనిస్తాము. ప్రభుత్వం- పార్లమెంట్​ మా ముందు తలవంచాలని మేం కోరుకోవడం లేదు. కానీ మా ఆత్మగౌరవాన్ని మేము ఎల్లప్పుడూ కాపాడుకుంటాం. అరెస్టు(ట్రాక్టర్​ ర్యాలీ హింసపై) చేసిన వారిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. చర్చల కోసం అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. మా సమస్యకు మర్యాదపూర్వక పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం. ఒత్తిడి మధ్య మేము ఏ నిర్ణయాన్ని అంగీకరించబోము."

-- నరేశ్​ తికాయత్​, రైతు సంఘం నేత

జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్​ ర్యాలీలో ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పరిణామాలు కుట్రపూర్వకంగా జరిగాయని నరేశ్​ తికాయత్​ ఆరోపించారు. అన్ని జెండాల కంటే త్రివర్ణ పతాకానికి ఉన్నతమైన స్థాయి ఉంటుందని చెప్పారు. తాము జాతీయ పతాకాన్ని అగౌరవపర్చబోనివ్వమని స్పష్టం చేశారు.

'అప్పటివరకు కదిలివెళ్లం..'

ఘాజిపుర్​ సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతులకు పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని బీకేయూ ప్రతినిధి రాకేశ్​ తికాయిత్.. ఈటీవీ భారత్​తో​ అన్నారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి ఎంతో మంది రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తున్నారని స్పష్టం చేశారు. పోలీసులు తమను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. చట్టాలను రద్దు చేసేంతవరకు తాము ఎక్కడికీ కదలమని స్పష్టం చేశారు. సరైన వాతావరణంలో చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతున్న రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్​

ప్రభుత్వం తమకు నీళ్ల సరఫరా ఆపేసిందని రాకేశ్​​ తికాయిత్​ తెలిపారు. రైతులే తమ ఇళ్ల నుంచి ఇక్కడకు నీరును తీసుకొస్తున్నారని చెప్పారు. తమ ఆందోళన శాంతిపథంలోనే కొనసాగుతోందని.. ఇక ముందు కూడా ఇదే విధంగా ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:రైతు గుండె చప్పుడు- రాకేశ్​ టికాయిత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.