ETV Bharat / bharat

'అమెరికాలో ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుంది' - త్రివర్ణ పతాకంపై ముఫ్తీ

భాజపాపై జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శల పదును పెంచారు. బిహార్​ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుందని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్​ జెండాతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు.

Mehbooba
'అమెరికాలో ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుంది'
author img

By

Published : Nov 9, 2020, 6:25 PM IST

త్రివర్ణ పతాకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఎట్టకేలకు వెనక్కితగ్గారు. జమ్ముకశ్మీర్​ జెండాతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు. అయితే జమ్ముకశ్మీర్​ రాజ్యాంగం, సార్వభౌమాధికారం, జాతీయ సమగ్రతను ఒకదాని నుంచి మరొకటి విడదీయలేమన్నారు.

"వేలమంది కార్యకర్తలు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇన్నాళ్లూ జాతీయ జెండాను భూజాన మోసాం. అయితే నిక్కర్​లు (ఆర్​ఎస్​స్​ను ఉద్దేశించి) వేసుకునే కొంత మంది నేతలు వారి కార్యాలయాల్లో ఏనాడూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు. అలాంటి వాళ్లు జెండా గురించి మాకు పాఠాలు చెబుతున్నారు."

- మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం

దేశంతో జమ్ముకశ్మీర్​కు ఉన్న బంధాల్ని ఆర్టికల్​ 370 రద్దుతో కేంద్రం తెంచే ప్రయత్నాలు చేసిందని ముఫ్తీ ఆరోపించారు. ముందు తమ జమ్ముకశ్మీర్​ జెండాను తమకు తిరిగి ఇవ్వాలని ముఫ్తీ డిమాండ్ చేశారు.

ట్రంప్​ గతే...

బిహార్​ అసెంబ్లీ ఎగ్జిట్​ పోల్స్​పై ముఫ్తీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుందని జోస్యం పలికారు.

"యువకుడు తేజస్వీ యాదవ్​కు నా అభినందనలు. కూడు, గూడు, గుడ్డ వంటి సాధారణ అవసరాలను తీర్చేలా ఆయన ఆలోచనా విధానం ఉంది. ఆర్టికల్​ 370ని రద్దు చేయాలని ప్రజలు కోరుకోలేదు. ప్రజలు కోరుకునేది సాధారణ అవసరాలు మాత్రమే. ప్రస్తుతం భాజపా సమయం నడుస్తుంది.. భవిష్యత్తులో మా కాలం వస్తుంది. అప్పుడు ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుంది. మాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నేతలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. వాళ్లు అవినీతిలో అన్ని రికార్డులు దాటేశారు."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.