ETV Bharat / bharat

'అల్లోపతి డాక్టర్లను ఆయుర్వేద వైద్యులుగా మార్చేస్తా!'

యోగా గురు బాబా రాందేవ్​ అల్లోపతి వైద్యులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో 1000 మంది అల్లోపతి డాక్టర్లను ఆయుర్వేద వైద్యులుగా మార్చేస్తానని అన్నారు.

baba ramdev
బాబా రాందేవ్, యోగా గురు రాందేవ్ బాబా
author img

By

Published : May 28, 2021, 3:55 PM IST

అల్లోపతి వైద్యులపై యోగా గురు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది సమయంలో 1000 మంది అల్లోపతి డాక్టర్లను ఆయుర్వేద వైద్యులుగా మారుస్తానని ప్రకటించారు.

ప్రజలకు ఆయుర్వేదం శక్తి తెలియ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాందేవ్ పేర్కొన్నారు. చాలా మంది విశ్రాంత​ అల్లోపతి డాక్టర్లు ఆయుర్వేద వైద్యులుగా మారేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇటీవలే అల్లోపతి వైద్యంపై యోగా గురు రాందేవ్ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఉత్తరాఖండ్ వైద్య సంఘం రాందేవ్​పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదీ చదవండి:కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తునకు భారత్​ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.