ETV Bharat / bharat

ఇద్దరు భార్యల ముద్దుల భర్తకు మహాకష్టం.. '50-50 ఫార్ములా'తో పోలీసుల తీర్పు! - ఇద్దరు భార్యల మధ్య భర్త పంపకం

Wifes Divided Husband: బిహార్ పూర్ణియా జిల్లాలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు కౌన్సిలింగ్ సెంటర్​లో ఇద్దరు భార్యల మధ్య భర్తను పంచిన ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పెళ్లైన విషయం దాచి తనను వివాహం చేసుకున్న భర్తపై రెండో భార్య పోలీసులను సంప్రదించగా.. కౌన్సిలింగ్​లో ఇలాంటి ఒప్పందం కుదిరింది. ఇద్దరు భార్యలు దీనికి సమ్మతించారు.

Unique judgment of Police Family Center in purnea
ఇద్దరు భార్యల మధ్య భర్త పంపకం
author img

By

Published : Mar 29, 2022, 11:39 AM IST

Wifes Divided Husband: ఎక్కడైనా ఆస్తి, భూమి పంపకాలు జరుగుతాయి. కానీ భర్తను పంచుకోవడం చూశారా? అయితే.. బిహార్ పూర్ణియా జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. ఇద్దరు భార్యల మధ్య గొడవ కారణంగా భర్త ప్రతి 15 రోజులు ఒకరి దగ్గర ఉండాలనే తీర్పు వెలువరించింది పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్​.

జిల్లాలోని భవానీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గరియారి గ్రామంలో ఓ వ్యక్తి పెళ్లైన విషయం దాచి మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో ఆరుగురు పిల్లల సంతానం కూడా ఉంది. ఇద్దరు భార్యలకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. వెంటనే రెండో భార్య.. భర్తతో గొడవకు దిగింది. దీంతో ఆమెను కొట్టి, ఇంటి నుంచి పంపించేశాడు భర్త. మొదటి భార్య పిల్లల్ని రెండో భార్య కొడుతుందని ఆరోపించాడు.

తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను సంప్రదించింది రెండో భార్య. వాళ్లు ఈ విషయాన్ని కౌన్సిలింగ్ సెంటర్​ ద్వారా పరిష్కరించారు. ఇద్దరు భార్యల మధ్య చర్చ జరిపారు. ఇందులో భర్తను ఇద్దరు భార్యలు పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది. నెలలో ప్రతి 15 రోజులు ఒక భార్య దగ్గర భర్త ఉండాలనే నిర్ణయానికి ఇద్దరు భార్యలు అంగీకరించారు. ఇద్దరినీ వేరు వేరు ఇళ్లలో ఉంచి, భర్త పోషించాలని ఒప్పందం కుదిరింది. దీంతో ఇద్దరు భార్యలు సంతోషంగా ఇంటికి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: భర్తతో కలిసి స్నేహితురాల్ని చంపి.. మృతదేహాన్ని బ్యాగ్​లో చుట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.