ETV Bharat / bharat

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. చేయి నరికేసిన భర్త - భార్య చేతిని నరికేసిన భర్త

wife wrist cuts husband: భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఏ భర్త అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విభిన్నంగా భార్య చేయిని నరికేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

wife wrist cuts husband
భార్య చేయిని నరికేసిన భర్త
author img

By

Published : Jun 7, 2022, 12:02 PM IST

wife wrist cuts husband: భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందని భయపడ్డాడు ఓ భర్త. ఆమెతో తగాదాలకు పాల్పడ్డాడు. ఉద్యోగం మానేయమన్నాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడం వల్ల.. భార్య చేయిని నరికేశాడు ఓ కిరాతకుడు. బాధితురాలు రేణు ఖాతున్​ను దుర్గాపుర్​లోని ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బంగాల్​లోని తూర్పు బుర్ద్వాన్​ జిల్లా కోజల్సా గ్రామంలో జరిగింది. నిందితుడితో సహా అతడి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది.

wife wrist cuts husband
భార్య చేయిని నరికేసిన భర్త

అసలేం జరిగిందంటే: షేర్​ మహమ్మద్, రేణు ఖాతున్​ భార్యాభర్తలు. రేణు.. దుర్గాపుర్​లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్​లో నర్సింగ్ శిక్షణ తీసుకుండేది. ఈ మధ్యే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాసై ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం చేయడానికి నిందితుడు షేర్​ మహమ్మద్ అంగీకరించలేదు. దీంతో ఇరువురి దంపతుల మధ్య వివాదాలు వచ్చాయి. ఆ సమయంలోనే భార్యపై కోపంతో పదునైన ఆయుధంతో ఆమె కుడి చేయిని నరికేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని ఆసుపత్రిగా తరలించగా వైద్యులు ఆమె చేయిని తొలగించి వైద్యం చేశారు.

"రేణు ఖాతున్, షేర్ మహమ్మద్​లకు చదువుకునేటప్పటి నుంచే పరిచయం ఉంది. దీంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాక.. వీరి పెళ్లి చేశాం. రూ. లక్ష నగదు, బంగారు ఆభరణాలు, సామాన్లు కట్నం కింద ఇచ్చాం. అయితే షేర్ మహమ్మద్.. రేణు ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు. అందుకే షేక్​.. రేణు చేతిని నరికేశాడు."

-రిపోన్ షేక్,బాధితురాలు రేణు ఖాతున్​ తాత

ఇవీ చదవండి: ఆన్​లైన్ రమ్మీకి బానిసై.. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.