wife rape in Baduan: భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. శత్రువులను ఇరికించాలనే దురుద్దేశంతోనే నిందితుడు ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బదాయూలో ఆదివారం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నిందితుడు తన భార్య(22)ను సహస్వాన్ ప్రాంతంలోని అడవికి బైక్‌పై తీసుకెళ్లాడు. అనంతరం స్నేహితుడిని పిలిచి అతడితో కలిసి రెండు సార్లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేసి తన భార్యపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు.
పోలీసు విచారణలో బాధితురాలు అసలు విషయం వెల్లడించింది. తన భర్త తమ గ్రామంలో ఇద్దరు వ్యక్తులను ఈ కేసులో ఇరికించాలని ఇలా చేశాడని తెలిపింది. వారితో గొడవలు కారణంగానే పగ తీర్చుకునేందుకు ఇలా చేశాడని పేర్కొంది. బాధితురాలి భర్త, అతని స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య గొంతుకోసి..: వివాహేతర సంబంధం వద్దన్నందుకు సొంత భార్యనే గొంతు కోసి చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని రాంపుర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త సోహన్‌లాల్, మామ రాంలాల్, మరిది పాపేంద్రపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు సోహన్‌లాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం వద్దన్న కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గ్యాంగ్‌స్టర్ ఇంటిపై పోలీసుల రైడ్.. కాసేపటికే బాలిక మృతి.. ఏమైంది?