మరణించిన వ్యక్తి వీర్యంపై అధికారం అతడి భార్యకు మాత్రమే ఉంటుందని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.
ఆస్పత్రిలో భద్రపరిచిన తన కుమారుడి వీర్యాన్ని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ వ్యక్తి న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్‌కు ఎలాంటి ప్రాథమిక హక్కులు లేవని జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య స్పష్టం చేశారు.
ఎన్ఓసీ అయినా...
అంతకుముందు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. మృతుడు తలసేమియా వ్యాధిగ్రస్థుడని తెలిపారు. ఆస్పత్రిలో భద్రపరిచిన వీర్యాన్ని పిటిషనర్ తీసుకునేందుకు మృతుడి భార్యను 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లనందున... తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
దిల్లీలోని ఓ ఆసుపత్రిలో మృతుడి వీర్యాన్ని భద్రపరిచారు. దాన్ని సేకరించేందుకు అతడి తండ్రి ప్రయత్నించగా.. మృతుడి భార్య అనుమతి తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించింది. దాంతో కోర్టును ఆశ్రయించారు సదరు తండ్రి.
ఇదీ చూడండి:యూపీఎస్సీ ఆశావహులకు కేంద్రం షాక్!