Wife killed husband: వివాహేతర సంబంధం ఉన్న ఓ మహిళ తన ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. శనివారం.. మహారాష్ట్ర, ముంబయిలోని గోవాండీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది.. హత్యకు గురైన ఇర్ఫాన్ ఖాన్కు (34) కొన్నాళ్ల క్రితం నాజరియా అనే మహిళతో వివాహమైంది. అయితే గత కొంతకాలం క్రితం నాజరియాకు సదర్ ఆలం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నిందితురాలు.. ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ క్రమంలో శనివారం రాత్రి సుమారు 11 గంటలకు సదర్తో కలిసి భర్తను హత్య చేసింది. ఇర్ఫాన్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
అయ్యో పాపం..: కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. బాత్రూంలోకి వెళ్లిన భాగ్య అనే ఏడాది చిన్నారి ప్రమాదవశాత్తు అక్కడి నీళ్ల బకెట్లోకి తలకిందులుగా పడిపోయింది. ఆ సమయంలో చిన్నారిని తల్లిదండ్రులు గమనించకపోవడం వల్ల కాసేపటికి ఆమె ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. కొద్దిసేపటికి చిన్నారి కోసం ఇంట్లో వెతకగా.. స్నానాల గదిలో భాగ్య విగతజీవిగా పడి కనిపించింది. భాగ్య.. జయేశ్-శరణ్య దంపతుల ఒక్కగానొక్క కూతురని.. అల్లారముద్దుగా పెరుగుతూ వచ్చిన ఆమె ఇలా విగతజీవిగా పడి ఉండటం జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబీకులు కన్నీరుమున్నీరు అయ్యారు. సోమవారం సాయంత్రం సుమారు 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లండిచారు.
ఇదీ చూడండి : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి