బ్లాక్ ఫంగస్‌తో భార్య మరణించడాన్ని తట్టుకోలేక నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. పిల్లలకు విషమిచ్చి ఆపై తాను కూడా తాగి చనిపోయాడు. కర్ణాటక బెల్గాంలోని బోరగల్ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.
మృతుడి పేరు గోపాల్ హాదిమణి. పిల్లల పేర్లు సౌమ్య(19), శ్వేత(16), సాక్షి(16), సృజన్(8).
గోపాల్ భార్య జయ జులై 6న బ్లాక్ ఫంగస్‌తో మరణించింది. అప్పటి నుంచి అతడు మానసికంగా కుంగిపోయాడు. తన భార్య లేకుండా కుటుంబం బతకలేదని విషం తీసుకుని పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గోపాల్ కుటుంబం మృతితో అతని బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముగ్గురు ఆడపిల్లలను విగతజీవులుగా చూసి తల్లడిల్లారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో గోపాల్ ఇంటికి చేరుకున్నారు.
ఇదీ చదవండి: సిటీ బస్సు ఎక్కిన సీఎం- అవాక్కైన ప్రయాణికులు