Widow Remarries Dead Man: ఒడిశాలో ఓ వింత వివాహం జరిగింది. చనిపోయిన వ్యక్తిని పెళ్లాడింది ఓ వితంతువు. కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్దంగా వివాహమాడింది. ఘాసీ అమనాత్య అనే వ్యక్తి కొరాపుట్ జిల్లాలోని పొడపాడర్ గ్రామంలో నివసించేవాడు. అతనికి కొన్నేళ్ల క్రితం సుబర్న అనే మహిళతో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల కింద కొందరు గ్రామస్థులతో కలిసి ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాడు ఘాసీ. అయితే, అతడు మార్గమధ్యంలోనే తప్పిపోయాడు. అతడి స్నేహితులు ఎంత వెతికినా జాడ దొరకలేదు. దీంతో ఎనిమిది నెలల తర్వాత ఘాసీ మరణించాడని.. అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఘాసీ మరణించాడని తెలిసిన బంధువులు, కుటుంబ సభ్యులు అతడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అప్పటి నుంచి అతడి భార్య సువర్ణ వితంతువుగా జీవిస్తోంది. కానీ రెండు నెలల క్రితం ఘాసీ ఇంటికి రావడం వల్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. తప్పిపోయి తిరిగి వచ్చిన విషయాన్ని గ్రామస్థులకు వివరించాడు ఘాసీ. సువర్ణ వితంతువుగా మారినందున.. ఆమెను తిరిగి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని గ్రామపెద్దలు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో శివాలయంలో దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
ఇదీ చదవండి: అసోం గోస: నీటమునిగిన ఇళ్లు.. రైల్వే ట్రాక్లే నివాసాలు.. రోజుకు ఒక్కపూటే భోజనం