Mahabaleshwar tourist fell into valley: కోతికి చిప్స్ ఇస్తూ ఓ టూరిస్ట్ లోయలో పడిపోయాడు. మహారాష్ట్ర మహాబలేశ్వర్- ప్రతాప్‌గఢ్ ఘాట్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సందీప్ ఓంకార్ నేహ్తే(33).. ప్రస్తుతం పుణెలోని బావ్దాన్లో ఉంటున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి హరిహరేశ్వర్ నుంచి మహాబలేశ్వర్కు వెళ్తున్నాడు. అంబెన్లీ ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వీరు.. జనని మాత మందిరం సమీపంలోని ఓ లోయ వద్ద కోతులను చూశారు. వాటికి ఆహారం పెట్టేందుకు ఆగారు. ఈ క్రమంలోనే సందీప్.. కోతులకు చిప్స్ అందించేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా కాలుజారి వంద అడుగుల లోయలోకి పడిపోయాడు.
అయితే, వెంటనే స్థానిక ట్రెక్కర్లు, మహాబలేశ్వర్ పోలీసులకు సమాచారం అందింది. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు ప్రారంభించి.. బాధితుడి జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. వర్షంతో పాటు దట్టంగా పొగమంచు అలుముకున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించారు. మూడు గంటల పాటు శ్రమించి.. సందీప్‌ను బయటకు తీశారు. వెంటనే మహాబలేశ్వర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సతారా జిల్లా ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి:
భూమిలో నోట్ల కట్టలు.. ట్రాక్టర్‌తో దున్నుతుంటే బయటకు.. పోలీసులు వచ్చేలోపే..